Amazon Prime | అమెజాన్ ప్రైమ్‌కు షాక్.. ఫెడరల్ కోర్టులో కేసు వేసిన ఆస్ట్రేలియా కన్జ్యూమర్ కమిషన్!
Amazon Prime | ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌కు ఆస్ట్రేలియాలో భారీ చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
Amazon Prime | ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌కు ఆస్ట్రేలియాలో భారీ చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ మధ్యలో వినియోగదారులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాణిజ్య ప్రకటనలను (యాడ్స్) ప్రవేశపెట్టడం, ఒకవేళ ఆ ప్రకటనలు రాకుండా ఉండాలంటే చందాదారుల నుంచి అదనపు రుసుము వసూలు చేయడమే ఇందుకు కారణం. అమెజాన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ కమిషన్ (ACCC) తీవ్రంగా పరిగణించింది. వార్షిక ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఒప్పందాల్లో అమెజాన్ నిబంధనలను ఉల్లంఘించిందని, వినియోగదారులను మోసం చేసిందని ఆరోపిస్తూ ఫెడరల్ కోర్టులో ఆ సంస్థపై దావా వేసింది.
ఈ మార్పుల వల్ల నవంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో దాదాపు 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు తీవ్రంగా ప్రభావితం అయ్యారని కన్జ్యూమర్ కమిషన్ వెల్లడించింది. ఆస్ట్రేలియాలో 2024 నుంచి ప్రైమ్ వీడియోలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అమెజాన్ ప్రకటనలను ప్రారంభించింది. దీనివల్ల అప్పటికే ఏడాది మొత్తానికి పూర్తి డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకున్న దాదాపు 8.5 లక్షల మంది చందాదారులు బలవంతంగా ప్రకటనలతో కూడిన వీడియోలను చూడాల్సి వచ్చింది. ఒకవేళ యాడ్స్ లేకుండా ప్రశాంతంగా వీడియోలను చూడాలనుకుంటే, పాత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా డబ్బులు చెల్లించాలని అమెజాన్ కొత్త నిబంధన విధించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ముందే పూర్తి రుసుము చెల్లించిన వినియోగదారులపై ఇలాంటి రూల్స్ రుద్దడం అన్యాయమని ఏసీసీసీ కోర్టుకు వివరించింది. ఇక బాధితులైన వినియోగదారులందరికీ అమెజాన్ సంస్థ తగిన నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషన్ న్యాయస్థానాన్ని కోరింది. కాగా, ఈ న్యాయపోరాటంపై స్పందించిన అమెజాన్ ఆస్ట్రేలియా ప్రతినిధి, తాము ఈ కేసును నిశితంగా పరిశీలిస్తున్నామని మరియు కోర్టు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

