Alochana | దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా “ఆలోచన” చిత్ర టీజర్ విడుదల!
Alochana | పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ నిర్మిస్తున్న నూతన చిత్రం "ఆలోచన" టీజర్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన ఉమ్మడిగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తూ దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు.
Alochana | పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ నిర్మిస్తున్న నూతన చిత్రం “ఆలోచన” టీజర్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన ఉమ్మడిగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తూ దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ వంటి దిగ్గజ తారాగణం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల పద్మశ్రీ మురళి మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ను స్టార్ రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడూతూ టీజర్ చాలా ఆకట్టుకునేలా ఉందని, చిత్రంలో వాడిన కెమెరా ఫ్రేమింగ్, సంగీతం, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనలు, ఎంచుకున్న కాన్సెప్ట్ ఎంతో బాగున్నాయని కొనియాడారు. వాస్తవ సంఘటనల ఆధారంగా స్నేహం నేపథ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన ఎంతో మంచి సంకల్పంతో నిర్మించారని అభినందించారు. మంచి కథాబలంతో పాటు సీనియర్ నటుల కాంబినేషన్‌తో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని, చిత్ర యూనిట్‌కి ఈ సినిమా గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టాలని ఆయన ఆకాంక్షించారు.
సాంకేతిక విభాగంలో టి. సురేంద్ర రెడ్డి కెమెరామెన్‌గా, వియాన్ సంగీత దర్శకుడిగా, ప్రతాప్ రాజులపల్లి గేయ రచయితగా, ఆర్.ఎల్.వర్మ ఎడిటర్‌గా, గిరీష్ దేవాంగ్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సి.హెచ్.విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసుకున్న “ఆలోచన” చిత్రం అతి త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన పాటలను, ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

