తమ్ముడికి పేరు రావాలి
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ…‘ఈ చిత్ర విజయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. ఇందుకు దర్శకుడు రాకేష్ శశికి థాంక్స్ చెప్పాలి. నా కంటే శిరీష్ సినిమాలు చూసేందుకు నాన్న అరవింద్ ఎక్కువ ఇష్టపడతారు.
నా సినిమాల కంటే శిరీష్ చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటాను. ‘పుష్ప 1’ లో తగ్గేదేలే అంటే ‘పుష్ప 2’ అసలు తగ్గేదేలే అనేలా ఉంటుంది’ అన్నారు. దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ..‘నిర్మాతల సహకారం వల్లే ఈ సినిమా అనుకున్నట్లుగా తెరపైకి వచ్చింది. అందరికీ నచ్చిన తర్వాతే విడుదల తేదీ ప్రకటించాం. శిరీష్, అనూ నటనకు ప్రశంసలు వస్తున్నాయి’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ…‘అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. శిరీష్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. వాళ్లిద్దరి విజయాలు చూస్తుంటే ఇంకే కావాలనిపిస్తుంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

