Allu Arjun | బీఎస్ఎఫ్ జవాన్లతో అల్లు అర్జున్ ఫ్యామిలీ..ట్రెండింగ్‌లో స్టిల్
ప్రస్తుతం వెకేషన్ టూర్లో ఉన్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). ఇవాళ అల్లు అర్జున్ కుటుంబం అమృత్‌సర్‌లో బీఎస్ఎఫ్ జవాన్ల (BSF soldiers)తో చిట్‌చాట్ చేశారు.
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం వెకేషన్ టూర్లో ఉన్నాడు. ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సందర్శించిన బన్నీ..అక్కడే సతీమణి అల్లు స్నేహ పుట్టినరోజును జరిపాడు. ఇవాళ మరో అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అల్లు అర్జున్ కుటుంబం అమృత్‌సర్‌లో బీఎస్ఎఫ్ జవాన్ల (BSF soldiers)తో చిట్‌చాట్ చేశారు.
బన్నీని చూసిన జవాన్లు సంతోషంలో మునిగిపోయారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. బీఎస్ఎఫ్ జవాన్లతో ఉన్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. గతేడాది పుష్ప..ది రైజ్‌తో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు బన్నీ. సుకుమార్డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇక త్వరలోనే పుష్ప..ది రూల్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు.
అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (Naa Peru Surya, Naa Illu India) చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కోపం సంబంధిత సమస్యలతో (Anger issues) బాధపడే ఒక సైనికుడు సరిహద్దుల్లో దేశ సేవ చేయాలనే తన కలను నెరవేర్చుకోవడానికి తన ప్రవర్తనను మార్చుకునే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఆశించిన విజయం అందుకోకపోయినా.. బన్నీ నటనపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు.
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లో ఆర్ఆర్ఆర్..వీక్షించనున్న జక్కన్న
Read Also :Satya Dev 26th film | స్పీడుమీదున్న సత్యదేవ్..కొత్త సినిమా లాంఛ్
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

