Allu Arjun | అల్లు అర్జున్‌తో సినిమా.. ఇన్‌స్టా పోస్టుతో హింట్ ఇచ్చిన బసిల్ జోసెఫ్!
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ సినిమా చేయబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాకపోయినా, తాజాగా బసిల్ జోసెఫ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ సినిమా చేయబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాకపోయినా, తాజాగా బసిల్ జోసెఫ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. బసిల్ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘Icon’ అని రాసి ఉన్న క్యాప్ ఫొటోను షేర్ చేశారు. ఈ ఒక్క పోస్టే ప్రస్తుతం టాలీవుడ్, మాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘ఐకాన్’ అనేది అల్లు అర్జున్‌కు అభిమానులు పెట్టిన బిరుదు కావడంతో, ఈ పోస్ట్ ఆయనతో చేయబోయే సినిమాపై పరోక్షంగా ఇచ్చిన హింట్ అని నెటిజన్లు భావిస్తున్నారు.
అల్లు అర్జున్, బసిల్ జోసెఫ్ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఇటీవల అల్లు శిరీష్ వివాహ వేడుకలో బసిల్ జోసెఫ్ పాల్గొనడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది. ఇద్దరి మధ్య కథా చర్చలు ఇప్పటికే జరిగినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ప్రాజెక్టును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ‘మిన్నల్ మురళి’తో సూపర్ హీరో జానర్లో తన సత్తా చాటిన బసిల్ జోసెఫ్, ‘శక్తిమాన్’ కథను అల్లు అర్జున్‌తో తెరకెక్కించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ వార్తలను దర్శకుడు ఇప్పటికే ఖండించారు. బన్నీతో చేయబోయేది పూర్తిగా కొత్త కథేనని స్పష్టం చేశారు. కథ వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అల్లు కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిపై పూర్తి స్పష్టత రానప్పటికీ, ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లే ప్రచారం సాగుతోంది.ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాతే బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం, అట్లీ సినిమా బన్నీ కెరీర్లో 22వ చిత్రం కాగా, లోకేష్ మూవీ 23వ చిత్రంగా రానుంది. బసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్‌ను అల్లు అర్జున్ తన 25వ చిత్రంగా ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

