అల్లరి నరేష్ నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ట్రైలర్‌ను అగ్ర నటుడు నాగార్జున విడుదల చేశారు. హీరో సూరి (అల్లరి నరేష్) అభ్యర్థనతో భూలోకానికి దిగి వచ్చిన రంభ, ఊర్వశి, మేనక అనుకోని పరిస్థితుల్లో తమ దివ్యశక్తులను కోల్పోతారు.
ఈ ముగ్గురూ తన ఇంట్లోనే ఉండటంతో సూరికి ఎదురయ్యే ఇబ్బందులు, ఈ క్రమంలో జరిగే సంఘటనలతో ట్రైలర్ ఆద్యంతం హాస్యప్రధానంగా సాగింది. వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో నవ్వుల్ని పూయించారు. పురాణ నేపథ్యంలో, ఫాంటసీ అంశాల కలబోతగా ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుందని మేకర్స్ తెలిపారు. సురభి, రాశిసింగ్, విష్ణుప్రియ, ప్రిషాసింగ్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, దర్శకత్వం: చంద్రమోహన్ చింతాడ.