అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కనకదుర్గ’. కాజల్ చౌదరి కథానాయిక. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి నిర్మాతలు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల కెమెరా స్విచాన్ చేశారు. స్వప్నదత్ గౌరవ దర్శకత్వం వహించారు.
అగ్ర నిర్మాత శ్యాప్ప్రసాద్రెడ్డి స్క్రిప్ట్‌ని దర్శక, నిర్మాతలకు అందించారు. వీరితోపాటు హరీశ్‌శంకర్, మిక్కిలినేని సుధాకర్, కోన వెంకట్, ప్రశాంత్‌వర్మ మధుర శ్రీధర్, సుప్రియ, విద్యా కొప్పినీడు, పద్మ కస్తూరి రంగన్, అనురాధ గూడూరు, దివ్య విజయ్, హన్షితరెడ్డి, జాన్వీ నారంగ్, స్రవంతి చొక్కారపు, వైఘారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘కనకదుర్గ’ సినిమా నాకెంతో ప్రత్యేకం. ఆ తల్లిపై ఉన్న భక్తి కూడా అందుకు ఓ కారణం. ఇది భక్తిరసాత్మక చిత్రం మాత్రమే కాదు. అన్ని శక్తులకూ ఆదిమూలమైన మహాశక్తి ప్రభావం సకలచరాచర సృష్టిపై ఎలా ఉందో తెలిపే కథ ఇది’ అని దర్శకుడు ప్రదీప్ మద్దాలి తెలిపారు. సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: బీవీఎస్ రవి, సమర్పణ: అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, నిర్మాణం: టెంపుల్ టౌన్ పిక్చర్స్.