ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకి సంబంధించిన ఏ వార్త అయిన నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటుంది. జనవరి 7న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి.
సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో చరణ్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్ర కోసం అలియా భారీగానే డిమాండ్ చేసిందని తెలిసింది. 10 రోజుల షూటింగ్ కి గాను ఈ బ్యూటీ ఏకంగా రూ.5 కోట్లు ఛార్జ్ చేసిందట. అంటే రోజుకి 50 లక్షలు చొప్పున అలియాకి ఆర్ఆర్ఆర్ నిర్మాతలు చెల్లించారు.
10 రోజుల షూటింగ్ కే 5 కోట్లు అంటే చాలా టూమచ్ అనేస్తున్నారు. పారితోషికం కారణంగానే అప్పట్లో ఒకానొకదశలో ప్రాజెక్ట్ నుంచి అలియా భట్ తప్పుకుంటుందని ప్రచారం సాగింది. అయితే ఆ పాత్రకు కేవలం అలియా మాత్రమే కావాలని రాజమౌళి పట్టుడట్టడంతో నిర్మాత దానయ్య చేసేది లేక 5 కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆలియాకు పాన్ ఇండియా అప్పీల్ ఉంది. హిందీ ఆడియన్స్లో తనకు ఉన్న పాపులారిటీ ఆర్ఆర్ఆర్ కి ప్లస్ కానుందని రాజమౌళి భావిస్తున్నారు.అందుకే పట్టుబట్టి ఆమెను తీసుకున్నట్టు సమాచారం.