Alia Bhatt | హాలీవుడ్ నటికి తెలుగు నేర్పించిన అలియా భట్.. వీడియో వైరల్
Alia Bhatt | బాలీవుడ్ లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్ (Alia Bhatt). వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు హాలీవుడ్ (Hollywood)లో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది.
Alia Bhatt | బాలీవుడ్ లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్ (Alia Bhatt). వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ద్వారా అలియా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు హాలీవుడ్ (Hollywood)లో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ (Heart of Stone) చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో మొదటిసారి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ప్రమోషన్స్‌లో భాగంగా అలియా భట్ తన సహ నటులు గాల్ గడోట్ (Gal Gadot), జేమీ డోర్నన్ (Jamie Dornan) తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా హాలీవుడ్ నటి గాల్‌కు తెలుగు నేర్పించే ప్రయత్నం చేసింది. ‘అందరికీ నమస్కారం.. మీకు నా ముద్దులు’ అని పలకమంది. ఆ పదాలను గాల్ అతికష్టంమీద పలికే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. టామ్ హార్పర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా ఆగస్టు 11న విడుదలవుతోంది. ఇంగ్లీష్, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
https://twitter.com/alianator07/status/1688624891090599936?s=20
Also Read..
Uttarakhand | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
Ambareesh Murty | పెప్పర్ ఫ్రై సీఈవో అంబరీష్ మూర్తి మృతి
Shivraj Singh chouhan | సీఎం చౌహాన్ రోడ్ షోలో ప్రమాదం.. వేదిక కూలి పలువురికి గాయాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

