Alia Bhatt | ఆలీయాపై పొగడ్తల వర్షం కురిపించిన బిగ్‌బీ.. లెటర్‌ను షేర్ చేసిన ఆలీయా
Alia Bhatt | సినీరంగంలో నటినటులు సినిమాలలో ఎన్ని పాత్రలు చేసినా వాళ్ళ మదిలో జీవితంలో గుర్తుండి పోయే పాత్ర ఒకటి చేయాలని ఎంతగానో ఆశ పడుతుంటారు. అందులో ముఖ్యంగా నటిమణులు లేడి ఓరియెంటెడ్ పాత్రలను చేయాలని ఎక్కువగా ఆశ పడుతుంటారు. ఎందుకంటే అలాంటి పాత్రలు ఒక్కటి చేసిన ఆ పాత్ర ప్రేక్షకులలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే నమ్మకం. ఇక ఇటీవలే బాలీవుడ్లో ఆలీయా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ ఒకటి. ముంభైలోని కామతిపుర రాజ్యానికి మాఫియా క్వీన్‌గా ఎదిగిన గంగూబాయి పాత్రలో ఆలీయాభట్ నటించింది. ఈ చిత్రంలో ఆలీయా నటన వర్ణనాతీతం. ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు ఈమె నటనకు ప్రశంసలు జల్లులు కురిపించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ గంగూబాయిలో ఆలీయా నటనను మెచ్చుకుంటూ ఓ లెటర్‌ను పంపాడు.
అమితాబ్ పంపిన లెటర్లో ‘ఆలీయా నువ్వు గంగుబాయి పాత్రలో అద్భుతంగా నటించావు, నీ నటనను ప్రశంసించడానికి మాటలు సరిపోవు’ అంటూ ఆలీయాపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ లెటర్‌ను ఆలీయా పంచకుంది. ఆలీయా, అమితాబ్‌తో కలిసి బ్రహ్మస్త్ర సినిమాలో నటించింది. ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఇక ఇటీవలే ఆలీయా రణ్‌బీర్‌ను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఎవరి సినిమాలో వారు బీజీగా అయిపోయారు. ఇక ఇటీవలే ఆలీయా ‘ఆర్ఆర్ఆర్’లో కూడా సందడి చేసింది. కనిపించింది కాస్తే అయినా సీత పాత్రలో ఒదిగిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

