ఇండో అమెరికన్ గూఢచారి..
ఇప్పటికే రెండు విజయాలతో ఏడాదిని విజయవంతంగా కొనసాగిస్తున్నది బాలీవుడ్ తార ఆలియా భట్. కెరీర్ పరంగా ‘ఆర్ఆర్ఆర్', ‘గంగూభాయ్ కథియావాడి’ ఇచ్చిన విజయాలతో పాటు ప్రేమికుడు రణబీర్‌తో పెళ్లి ఆమెకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఉత్సాహంలో ప్రస్తుతం ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నదీ భామ.
ఇప్పటికే రెండు విజయాలతో ఏడాదిని విజయవంతంగా కొనసాగిస్తున్నది బాలీవుడ్ తార ఆలియా భట్. కెరీర్ పరంగా ‘ఆర్ఆర్ఆర్’, ‘గంగూభాయ్ కథియావాడి’ ఇచ్చిన విజయాలతో పాటు ప్రేమికుడు రణబీర్‌తో పెళ్లి ఆమెకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఉత్సాహంలో ప్రస్తుతం ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నదీ భామ. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ పేరుతో దర్శకుడు టామ్ హార్పర్ తెరకెక్కిస్తున్నారు.
ఈ స్పై థ్రిల్లర్‌లో ఆలియా మాయా సింగ్ అనే ఇండో అమెరికన్ గూఢచారి పాత్రలో కనిపించనుంది. గాల్ గాడట్, జామీ డోర్నన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంగ్లండ్‌లో జరుగుతున్నది. ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నది ఆలియా. ఆమెకు ఈ సినిమా హాలీవుడ్ ఆఫర్‌తో పాటు మరో గొప్ప మేలు చేసిందంటున్నారు ఆమె స్నేహితులు. ఇటీవల దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఆ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ పార్టీనే కోవిడ్‌కు సూపర్ స్ప్రెడర్ అయ్యింది. షారుఖ్ ఖాన్, కత్రీనా కైఫ్ సహా దాదాపు 50 మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఆలియా ఉండి ఉంటే తప్పకుండా పార్టీకి వెళ్లేదని, ఆమెకూ వైరస్ సోకే అవకాశాలు ఉండేవని ఉత్తరాది మీడియా విశ్లేషిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధ్యాయులకే రక్షణ లేకుంటే విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా ఎక్కడ?
Legacy | షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. 2027 ఫిబ్రవరిలో గ్రాండ్ రిలీజ్!
ఏఐఎస్ఎఫ్ జూలూరుపాడు మండల నూతన కమిటీ
కారేపల్లి మండల గిరిజన బిడ్డలకు కాకతీయ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్
Deepam lit atop Deepathoon | తిరుపరంకుండ్రం కొండపైన రాతి స్తంభంపై.. ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

