హిందీ చిత్రసీమలో చక్కటి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న తారల్లో చాలా మంది తమ తదుపరి గమ్యంగా హాలీవుడ్ను ఎంచుకుంటారు. ప్రపంచ సినిమాకు తలమానికంగా భావించే హాలీవుడ్లో రాణించడం జీవనసాఫల్యంగా భావిస్తారు. బాలీవుడ్లో అగ్ర కథానాయికలుగా పేరు తెచ్చుకున్న ప్రియాంకచోప్రా, దీపికాపడుకోన్ హాలీవుడ్ చిత్రాల్లోనూ తమదైన ముద్రతో దూసుపోతున్నారు. తాజాగా వారి వరుసలో చేరబోతున్నది అలియాభట్. హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తూ ఈ అమ్మడు ఓ స్పైథ్రిల్లర్లో నటించనుంది. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హాలీవుడ్ అరంగేట్రానికి సంబంధించిన శుభవార్తను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుందీ భామ. “హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే గూఢచారి థ్రిల్లర్ చిత్రంలో నటించబోతున్నా. ఇందులో జామి డోర్నన్, గాల్గోడ్ వంటి ప్రముఖ తారలు భాగమవుతున్నారు’ అని అలియాభట్ పేర్కొంది. నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇటీవల విడుదలైన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంతో అలియాభట్ బాలీవుడ్లో మంచి విజయాన్ని దక్కించుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. ప్రస్తుతం ఆమె హిందీలో నాలుగు భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.