రోజురోజుకీ దక్షిణాదిపై అలియా ప్రేమ పెరిగిపోతున్నది. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ టైమ్‌లో హైదరాబాద్‌తో ప్రేమలో పడిన అలియా.. రీసెంట్గా ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం చెన్నై వెళ్లి, అక్కడి సముద్ర తీరంలో విహరించింది. తమిళ అభిమానులు తనపై చూపించిన ప్రేమను చూసి పరవశించింది. ఈ సందర్భంగా సూర్యాస్తమయానికి ముందు వచ్చే ‘గోల్డెన్ అవర్’ టైమ్‌లో బీచ్‌లో ఫొటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘గోల్డెన్ అవర్.. ఇంతటి ప్రేమని అందించినందుకు థాంక్యూ చెన్నై’ అంటూ ఫొటోలతోపాటు ఓ పోస్ట్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే.. అలియాకు ‘గోల్డెన్ అవర్’ ఫొటోలంటే చాలా ఇష్టం.
తన వివాహం జరిగినప్పుడు కూడా ‘గోల్డెన్ అవర్’ ఫొటోలతో ఇంటర్నెట్‌ని అలియా హోరెత్తించింది. దీని గురించి ఆమె తాజాగా మాట్లాడుతూ ‘గొప్పగొప్ప ఫొటోగ్రాఫర్స్కీ, చిత్రకారులకీ మాత్రమే ‘గోల్డెన్ అవర్’ విలువ తెలుస్తుంది. సూర్యాస్తమయానికి ముందు కొన్ని నిమిషాలు మాత్రమే ఈ సమయం ఉంటుంది. అప్పుడు ఆకాశం అద్భుతమైన అందాన్ని సంతరించుకుంటుంది. ఈ టైమ్‌లో సీన్స్ తీయడానికి కూడా డీవోపీలు ఉత్సాహం చూపిస్తుంటారు. ముఖ్యంగా ఎమోషనల్ లవ్ సీన్స్‌ని ఈ టైమ్‌లో తీస్తే సూపర్‌గా వస్తాయి. నాకైతే వ్యక్తిగతంగా ‘గోల్డెన్ అవర్’ ఇష్టం. ఆ టైమ్‌లో నేను బయటుంటే.. ఫోన్ తీసుకొని క్లిక్‌మనిపించకుండా ఉండను’ అంటూ చెప్పుకొచ్చింది అలియాభట్.