హాలీవుడ్ మూవీ రస్ట్ సినిమా సెట్లో ఊహించని ప్రమాదం జరిగింది. న్యూ మెక్సికోలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా, అలెక్ బాల్డ్విన్పై సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన ప్రాప్ గన్ని కాల్చారు. దీంతో సినిమాటోగ్రాఫర్ మృతిచెందారు. దర్శకుడు గాయపడ్డాడు. ఈ ఘటనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయబడలేదు, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
హాలినా హచ్చిన్స్, జోయొల్ సౌజా తుపాకీ ప్రమాదంలో గాయపడ్డారు. హచిన్స్కి తీవ్ర గాయాలు కావడంతో మరణించింది. దర్శకుడికి చిన్నపాటి గాయాలు కాగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. రిహార్సల్ సమయంలో తుపాకీ పేలినట్టుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రస్ట్ చిత్రం ఓ 13ఏళ్ల బాలుడు తన తాతతో కలిసి పరారీ నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీకి మిస్టర్ సౌజా దర్శకత్వం వహించారు .ఫ్రాన్సిస్ ఫిషర్ మరియు మిస్టర్ బాల్డ్విన్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెలతో పాటు వచ్చే నెలలో షూటింగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.