అభినవ రామచంద్రుడి కథ
కృష్ణవంశీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకుడు. హైనినా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు.
కృష్ణవంశీ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకుడు. హైనినా క్రియేషన్స్ పతాకంపై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు. ‘మా అమ్మ ఎప్పుడు చెప్పేది..మనల్ని ఎవరైనా ప్రేమిస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కారణాలు అడ్డు వచ్చినా ఆ ప్రేమని చనిపోయేంత వరకు వదులుకోకూడదు’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
‘ఆ రాముడు సీత కోసం ఒక్కసారే యుద్ధం చేశాడు. నా సీత కోసం ప్రతిక్షణం నాతో నేనే యుద్ధం చేస్తున్నా’ అనే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చాలా బాగుందని, సంభాషణలు హృదయాల్ని కదిలించేలా ఉన్నాయని దిల్ రాజు ప్రశంసించారు. నిజాయితీ కలిగిన ప్రేమికుడి కథ ఇదని దర్శకుడు తెలిపారు. తమ సంస్థకిది తొలి చిత్రమని, ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటుందని నిర్మాత పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

