పదేండ్ల స్వర్ణయుగం
స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తే గొప్ప అన్నట్లుంది ఇప్పటి పరిస్థితి. టెక్నాలజీ పెరిగాక కూడా ఇంత ఆలస్యమెందుకంటే..మెరుగైన సినిమాల కోసమే అంటారు హీరోలు. ఇలాంటి టైమ్‌లో క్యాలెండర్ మారేలోగా నాలుగు నుంచి ఐదు సినిమాల్లో నటిస్తూ వచ్చారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఇవన్నీ మూస చిత్రాలేమీ కాదు. యాక్షన్, కామెడీ, పేట్రియాటిక్, హారర్, హిస్టారికల్…ఇలా భిన్నమైన జానర్ సినిమాలున్నాయి.
2012 నుంచి ఇప్పటిదాకా అక్షయ్ జోరుకు మిగతా హీరోలంతా ఆలోచనల్లో పడ్డారు. స్టార్డమ్ పరిమితుల్లో బందీ అయిన షారుఖ్‌తో చూస్తే ఒక ఇమేజ్‌కు కట్టుబడకుండా ఉండటం వల్లే అక్షయ్ ఇన్ని వైవిధ్యమైన చిత్రాల్లో నటించగలిగాడు. ఈ పదేండ్ల స్వర్ణయుగం తర్వాత ప్రస్తుతం అక్షయ్‌కు కొంత ఎదురుగాలి వీస్తున్నది.
ఆయన గత మూడు చిత్రాలు ‘బచ్చన్ పాండే’, ‘సమ్రాట్ పృథ్వీరాజ్’, ‘రక్షా బంధన్’ ఆశించిన ఫలితాల్ని అందించలేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఐదు చిత్రాలు అక్షయ్ స్టార్‌డమ్‌పై గత ఫ్లాప్స్ ప్రభావం లేదని చెబుతున్నాయి. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని బాక్సాఫీస్ విజయాలు సాధించాలని విష్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

