అక్షయ్ రికార్డ్ సెల్ఫీ
గతంలో యునైటెడ్ కింగ్డమ్కు చెందిన జేమ్స్ స్మిత్, అమెరికా పాప్ సింగర్ డానీ వాల్బర్గ్, మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు అలన్ షెహరర్ కేవలం మూడు నిమిషాల్లో 168 సెల్ఫీలు దిగి సాధించిన రికార్డును అక్షయ్ బ్రేక్ చేశాడు.
రోజురోజుకు సినిమా ప్రమోషన్ల తీరు మారిపోతున్నది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి సినీజనం రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నంలో హీరో అక్షయ్‌కుమార్ ఏకంగా గిన్నిస్ రికార్డే సృష్టించాడు. మూడు నిమిషాల్లోనే అత్యధిక సెల్ఫీలు తీసుకొని ‘ఔరా!’ అనిపించుకున్నాడు. గతంలో యునైటెడ్ కింగ్డమ్కు చెందిన జేమ్స్ స్మిత్, అమెరికా పాప్ సింగర్ డానీ వాల్బర్గ్, మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు అలన్ షెహరర్ కేవలం మూడు నిమిషాల్లో 168 సెల్ఫీలు దిగి సాధించిన రికార్డును అక్షయ్ బ్రేక్ చేశాడు.

మూడు నిమిషాల్లో ఏకంగా 209 సెల్ఫీలు దిగి కొత్త మైలురాయి సెట్ చేశాడు. తన తాజా చిత్రం ‘సెల్ఫీ’ ప్రచారంలో భాగంగా అభిమానులతో చకచకా సెల్ఫీలు దిగాడు అక్షయ్. ముంబైలో జరిగిన ఒక ఈవెంట్లో 240 మంది అభిమానులు పాల్గొన్నారు.
సెల్ఫీ ఫొటో లైటింగ్, ఫోకస్ సరైన క్రమంలో ఉండాలన్న గిన్నిస్‌బుక్ షరతులకు లోబడి అక్షయ్ ఈ ఫీట్ సాధించాడు. ఇందులో భాగంగా ఒక నిమిషంలో అయితే ఏకంగా 79 సెల్ఫీలు దిగాడంటే అక్షయ్ వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. సెల్ఫీ చుట్టూ తిరిగే కథాంశంతో 2019లో వచ్చిన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’కు ‘సెల్ఫీ’ రీమేక్. ఈ నెల 24న విడుదలైన ఈ సినిమాలో అక్షయ్‌తోపాటు ఇమ్రాన్ హష్మీ, డయానా పాంటీ తదితరులు నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

