అక్రమ్ సురేష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘అక్రమ్’. రాజధాని అమరావతి మూవీస్ పతాకంపై ఎంవీఆర్, విసకోటి మార్కండేయులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. తాజాగా సినిమా టీజర్, పాటను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
అక్రమ్ సురేష్ మాట్లాడుతూ..‘ఇదొక యాక్షన్ సోషియో ఫాంటసీ మూవీ. రానా, అక్రమ్ అనే రెండు ప్రధాన పాత్రలతో సినిమా సాగుతుంది. వారిలోని అహం ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చింది అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.