Seetha Ramam Movie | బ్రిగేడియర్ విష్ణు శర్మగా అక్కినేని సుమంత్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్ పోస్టర్
Sumanth First Look Poster | అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో సుమంత్ ఒకడు. ఇప్పుడంటే ఈయన క్రేజ్ తగ్గింది కాని అప్పట్లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరి, ధన51, గోదావరి వంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్ళీరావా చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కమర్షియల్‌గా ఈ చిత్రం ఘన విజయం సాధించకపోయినా, సుమంత్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈయన అనగనగా ఓ రౌడి అనే యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈయన దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సీతారామంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లో సుమంత్ ఆర్మీ అధికారికగా మీసం కట్టుతో ఆకట్టుకుంటున్నాడు. లేటెస్ట్గా విడుదలైన ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తుంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న విడుదల కానుంది.
Unveiling the first look of our very own @iSumanth as 𝐁𝐫𝐢𝐠𝐚𝐝𝐢𝐞𝐫 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚
from #SitaRamam.https://t.co/rqLmOlw8VY@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/OYr1dFEoJE— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 9, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

