అఖిల్ లుక్ చూసి ఆశ్చర్యపోయా
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్'. యాక్షన్ స్పై థ్రిల్లర్ కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. సాక్షి వైద్య నాయిక. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది.
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్’. యాక్షన్ స్పై థ్రిల్లర్ కథతో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. సాక్షి వైద్య నాయిక. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు డినో మోరియా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆయన మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో నేను గాడ్ అనే రా (భారత గూఢచార సంస్థ)లో ఏజెంట్ పాత్ర పోషించాను. వ్యవస్థలో తనకు జరిగిన ద్రోహం కారణంగా వ్యవస్థకు ఎదురుతిరుగుతాను. పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. ఉద్వేగాలతో కూడిన ఒక పిచ్చితో ఉంటాడు. ఎమోషన్, డ్రామా కలగలిపి నా పాత్రను దర్శకుడు సురేందర్ రెడ్డి ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఈ సినిమా కథ వినగానే బాగా నచ్చింది. తెలుగులో అడుగుపెట్టేందుకు ఇది సరైన స్క్రిప్ట్ అనిపించింది.
ముగ్గురు ఏజెంట్స్ కథ ఇది. ఇందులో నేను ప్రతినాయకుడిగా కనిపిస్తా. కథలో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. రామ్‌చరణ్ నా మిత్రుడు. ఆయన ద్వారా గతంలో ఒకసారి అఖిల్‌ను కలిశాను. అప్పుడు చిన్న పిల్లాడిలా అనిపించారు. కానీ ఈ సినిమా సెట్లో చూసినప్పుడు ఆయనలో చాలా మార్పు కనిపించింది. ఈ క్యారెక్టర్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన లుక్ మొత్తం మార్చేసుకున్నాడు. కథలోని మలుపులు, భారీ యాక్షన్ సీక్వెన్సులు, బ్యూటిఫుల్ విజువల్స్ ..ఇవన్నీ ఒక కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ చూసిన అనుభూతిని కలిగిస్తాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

