పాటల సందడిలో లెనిన్
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్'. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో బలమైన సామాజికాంశాలను చర్చిస్తూ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మురళీకృష్ణ అబ్బూరు దర్శకుడు. జూన్ 26న ప్రేక్షకుల ముందుకురానుంది.
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో బలమైన సామాజికాంశాలను చర్చిస్తూ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మురళీకృష్ణ అబ్బూరు దర్శకుడు. జూన్ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో గురువారం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతూ ‘ఎట్టా ఎట్టా..’ అనే తొలి గీతాన్ని విడుదల చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు. సింగర్ శ్రీకృష్ణతో కలిసి తమన్ ఈ గీతాన్ని ఆలపించారు.
మాస్ మెలోడీగా సాగిన ఈ పాటలో నాయకానాయికలు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో, సంగీతం: తమన్, దర్శకత్వం: మురళీ కిశోర్ అబ్బూరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

