Agent Movie On OTT | ఏజెంట్ ఫలితం అక్కినేని ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు రెండేళ్లు ఒళ్లు హూనం చేసుకున్న అఖిల్‌కు ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందనుకుంటే.. తన కెరీర్లో ఒక మచ్చలా మిగిలిపోయింది. అసలు ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ధృవ సినిమా తీసిన సురేందర్ ఏనా అనే డౌట్ కూడా ఎంతో మందికి వచ్చింది. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటే ఏ స్థాయిలో ఈ సినిమా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత రెండు మూడు రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన చర్చే నడుస్తుంది. ఇంతలో నిర్మాత అనీల్ సుంకర ఈ సినిమా ఫేయిల్యూర్‌ను ఎలాంటి భేషజాలకు పోకుండా ఒప్పేసుకున్నాడు.
అంతేకాకుండా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమాను ప్రారంభించి తప్పుచేశాం అని బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ బుస్సుమని కూడా అన్నారు. ఇదంత పక్కన పెట్టేస్తే ఈ సినిమాతో నిర్మాత అనీల్‌కు, డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం తేరుకోలేని నష్టాలు వచ్చాయన్నది మాత్రం వాస్తవం. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్ రెంట్‌కు సరిపడ కలెక్షన్లు కూడా రావడం లేదని వినికిడి. ఇక రెండు రోజుల్లో విడుదలయ్యే ఉగ్రం, రామబాణం సినిమాలు ఏజెంట్ థియేటర్లను సగం సగం పంచుకోనున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను అప్పుడే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. నష్టాలను కొంత మేరైన పూడ్చుకోవాలని ఉద్దేశంతో మూడు వారాల్లోనే ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా హక్కులను సోనిలివ్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌కు కొనుగోలు చేసింది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నా.. వాటి కంటే ఎక్కువ ఆఫర్ చేసి ఈ సినిమాను కొనుక్కుంది. ఈ సినిమా వల్ల కాస్తో కూస్తో కలిసోచ్చేది సోని లివ్కే. ఎందుకంటే చాలా మంది థియేటర్లలో ఈ సినిమా చూడలేదు. దాంతో వ్యూవర్ షిప్ ఎక్కువగానే ఉంటుంది. ఇక సబ్స్క్రైబర్లు కూడా పెరిగే చాన్స్ లేకపోలేదు. ఈ సినిమా మే19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. సాక్షీ వైద్య హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకు హిప్ హాస్ తమిళ స్వరాలు సమకూర్చాడు. అయితే ఏ ఒక్క పాట కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఏకే ఎంటర్టైనమెంట్స్తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించాడు.