Tollywood | దసరా విన్నర్ ఎవరు.. మూడు సినిమాల్లో ఏది బెటర్..

Tollywood Box office | దసరాకు ఎప్పట్లాగే ఈ సారి కూడా సినిమాల సందడి బాగానే కనిపించింది. ముఖ్యంగా కుర్ర హీరోలు అంతా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. అక్టోబర్ 14న మహా సముద్రం అంటూ శర్వానంద్, సిద్ధార్థ్ వస్తే.. ఆ తర్వాత రోజే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ అక్కినేని, పెళ్లి సందD అంటూ శ్రీకాంత్ తనయుడు రోషన్ వచ్చాడు. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. వీటిలో దేనికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే మాత్రం మరో మాట లేకుండా లేకుండా అయ్యగారి పేరు చెప్పాల్సిందే. అంటే అఖిల్ అన్నమాట. సోషల్ మీడియాలో అభిమానులు ఈయన్ను ముద్దుగా అయ్యగారు అని పిలుచుకుంటారు.

అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు తొలిరోజు ఏకంగా 6.8 కోట్ల షేర్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి టాక్ పర్లేదు అనే వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి.

మరోవైపు మహా సముద్రం సినిమాకు నెగిటివ్ టాక్ చాలా మైనస్ అయిపోయింది. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలిరోజు వసూళ్లు తక్కువగా వచ్చాయి. శర్వానంద్, సిద్ధార్థ్ లాంటి క్రేజీ హీరోలు నటించినా కూడా కథ బాగోలేకపోవడంతో కలెక్షన్స్ పై బాగానే ప్రభావం చూపించింది. తొలిరోజుతోనే మహా సముద్రంలో ఉప్పెనలు బయటకి వచ్చేశాయి. ఆటుపోట్ల మధ్యలోనే ఈ చిత్ర ప్రయాణం సాగుతుంది.

ఇదే పండక్కి వచ్చిన మూడో సినిమా పెళ్లి సందD. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు. పెళ్లిలో పిల్ల సందడి తప్ప పెళ్లిలో సందడి కనిపించడం లేదంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. దీనికి కూడా కలెక్షన్స్ తక్కువగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లెక్కలు బట్టి చూస్తుంటే క్లియర్‌గా దసరా విన్నర్ అఖిల్ అక్కినేని అని తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. అఖిల్ టార్గెట్ అదుర్స్..
Dussehra Movies 2021 | ఈ మూడు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా..?
Box office |పెళ్లి సందD ముందు అంత భారీ లక్ష్యమా.. శ్రీకాంత్ తనయుడు తట్టుకుంటాడా..?
Aditi Rao Hydari | లెజెండరీ బయోపిక్‌లో నటించాలని ఉందట..|
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

