Lenin Movie | అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ఈరోజే థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో, సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను స్వయంగా చూసేందుకు అఖిల్ భార్య జైనబ్ రవ్జీ హైదరాబాద్‌లోని ప్రముఖ మాస్ థియేటర్ ‘శ్రీరాములు’కు విచ్చేశారు. థియేటర్ వద్ద అఖిల్ అభిమానులు, ప్రేక్షకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన జైనబ్, ‘లెనిన్’ చిత్రానికి లభిస్తున్న అద్భుతమైన పబ్లిక్ టాక్ మరియు అఖిల్ నటనకు వస్తున్న ప్రశంసలపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జైనబ్ థియేటర్‌కు వచ్చిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, మనం ఎంటర్ప్రైజెస్ LLP మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. ఇక అఖిల్ సరసన టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ‘భారతి’ అనే నాయిక పాత్రలో నటించింది. అలాగే ఈ చిత్రంలో శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరి రావు, ప్రమోద్ పంజు వంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందించగా.. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, మరియు అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వీటన్నింటికీ మించి ఈ సినిమాకు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) స్పెషల్ వాయిస్ ఓవర్ అందించడం ‘లెనిన్’ చిత్రానికి ఒక బిగ్గెస్ట్ హైలైట్‌గా మారింది.
#ZainabRavdjee, wife of @AkhilAkkineni8, at Sree Ramulu Theatre for #Lenin.#AkhilAkkineni pic.twitter.com/pTqURwsdQG
— Milagro Movies (@MilagroMovies) July 10, 2026