Lenin Trailer | ఊరమాస్ లుక్‌లో ‘అయ్యగారు’.. అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్
Lenin Trailer | అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) మూవీ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Lenin Trailer | అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) మూవీ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ఏజెంట్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి, అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ పవర్ఫుల్ విజువల్స్‌తో సాగింది. అక్కినేని నాగార్జున గంభీరమైన వాయిస్ ఓవర్‌తో, “ఇది మహాభారతం” అంటూ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. గరుడ పురాణం తరహా రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ అక్కినేని మునుపెన్నడూ లేని విధంగా ఊర మాస్ లుక్‌లో సరికొత్తగా కనిపించారు. యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సీన్స్‌లో అఖిల్ నటన సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో అఖిల్ సరసన హీరోయిన్గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, వీరిద్దరి కెమిస్ట్రీ విజువల్స్‌కు మరింత హైలైట్‌గా నిలిచాయి. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.
‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివాజీ, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

