Lenin | సెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్ ‘లెనిన్’.. రన్ టైం ఎంతంటే!
Lenin | అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. ఏజెంట్ వంటి డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్ల విరామం తీసుకుని అఖిల్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Lenin | అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. ఏజెంట్ వంటి డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్ల విరామం తీసుకుని అఖిల్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక ఈ సినిమా విజయంపై అటు అఖిల్, ఇటు చిత్ర యూనిట్ ఎంతో ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి ‘U/A’ సర్టిఫికెట్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొత్తం రన్టైమ్ 158 నిమిషాలు (2 గంటల 38 నిమిషాలు) గా లాక్ చేశారు. అయితే, సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం.. ‘లెనిన్’ కేవలం ఒక సాధారణ ప్రేమకథ మాత్రమే కాదని, ఇదొక హై-వోల్టేజ్, వయొలెంట్ యాక్షన్ డ్రామా అని స్పష్టమవుతోంది.
సినిమాకు ‘U/A’ రేటింగ్ సాధించడం కోసం సెన్సార్ బోర్డ్ సూచనల మేరకు మేకర్స్ కొన్ని మార్పులు చేశారు. సినిమాలో తలలు నరకడం, విపరీతమైన రక్తపాతం వంటి సుమారు 32 సెకన్ల హింసాత్మక దృశ్యాలను కత్తిరించినట్లు తెలుస్తుంది. అలాగే మరికొన్ని యాక్షన్ సీన్స్ తీవ్రతను తగ్గించేందుకు విజువల్స్ను కాస్త చికటిగా చేసినట్లు తెలుస్తుంది. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. భాగ్యశ్రీ ప్రమోద్, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరి రావు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ థమన్ సంగీతం అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

