Agent Movie | బాక్సాఫీస్ దగ్గర తేలిపోయిన ఏజెంట్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?
Agent Movie Collections | ఎప్పుడెప్పుడా అని అక్కినేని ఫ్యాన్సే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన ఏజెంట్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Agent Movie Collections | ఎప్పుడెప్పుడా అని అక్కినేని ఫ్యాన్సే కాదు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన ఏజెంట్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు చేసిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. తీరా రిలీయ్యాక మొదటి షో నుంచే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. పాత చింతకాయ పచ్చడిలా ఇప్పటికే ఎన్నో సార్లు చూసేసిన కథనే సురేందర్ రెడ్డి మళ్లీ చూపించాడని, కాకపోతే కాస్త యాక్షన్‌ను దట్టించాడని చాలా మంది ప్రేక్షకులు పెదవి విరిచారు. ఆయన మార్క్ సీన్స్ ఎక్కడ కనిపించలేదని, అసలు ఇది సురేందర్ రెడ్డి బొమ్మేనా అని కూడా పలువురు కామెంట్స్ కూడా చేశారు.
అఖిల్ మూడేళ్ల కష్టం బూడిదలో వేసిన పన్నీరైపోయినట్టయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. కాగా తొలిరోజు ఈసినిమాకు అటు ఇటుగా పది కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది. సినిమా బ్రేక్ ఈవెన్ కావలంటే దాదాపు రూ.60 కోట్ల గ్రాస్‌ను సాధించాల్సి ఉంటుంది. రెండో రోజు కూడా అంతంత మాత్రంగానే బుకింగ్స్ ఉన్నాయని టాలీవుడ్ విశ్లేషకులు తెలుపుతున్నారు. మరో వారం రోజుల్లో గోపిచంద్ రామాబాణం రిలీజ్ కానుంది. ఈ లోపే ఏజెంట్ వీలైనన్ని కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. పైగా పోటీగా పొన్నియన్సెల్వన్-2 రిలీజైంది. నిన్న, మొన్నటి వరకు ఈసినిమా పెద్దగా అంచనాల్లేవు.
కానీ మౌత్ టాక్ పాజిటీవ్‌గా రావడంతో తొలిరోజుకు మించి రెండో రోజు కలెక్షన్లు సాధించే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు తెలుపుతున్నారు. అయితే మాస్ ప్రేక్షకులు మాత్రం ఏజెంట్‌కే ఓటేస్తున్నట్లు తెలుస్తుంది. మరీ అఖిల్ ఈ సినిమాతోనైనా కమర్షియల్ హీరో స్టేటస్‌ను సాధిస్తాడో లేదో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

