Lenin Movie | బాక్సాఫీస్ షేక్ చేసిన ‘లెనిన్’.. మొదటి రోజే రూ.16.7 కోట్లతో అఖిల్ సరికొత్త రికార్డ్!
Akhil Akkineni | అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది.
Akhil Akkineni | అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. మొదటి రోజే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, అఖిల్ కెరీర్లోనే బెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సొంతం చేసుకుంది.
చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమాకు ఇండియా నెట్ కలెక్షన్స్ దాదాపు రూ.5.90 కోట్లు, ఇండియా గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.6.73 కోట్లు, అలాగే ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ దాదాపు రూ.3.00 కోట్లుగా వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు అత్యధిక వసూళ్లు వచ్చాయని, రెండు తెలుగు రాష్ట్రాల గ్రాస్ కలెక్షన్లే దాదాపు రూ.6 కోట్ల వరకు ఉన్నాయని సమాచారం. అఖిల్ కెరీర్లో గత చిత్రాలతో పోలిస్తే ‘లెనిన్’ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, థమన్ సంగీతంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మొత్తానికి అయ్యగారు ఈ చిత్రంతో గట్టి కంబ్యాక్ ఇచ్చారని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్లు మరికొంత భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
AKHIL 2.0 is here… and the box office has heard it loud and clear 🔥🔥🔥
A phenomenal 16.7 CR+ Worldwide Gross on Day 1 for #LENIN 💥💥💥
The Telugu audience has once again celebrated good cinema in the grandest way possible 🫶🏻🫶🏻#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8… pic.twitter.com/SA6IfcmVOG
— Sithara Entertainments (@SitharaEnts) July 11, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

