Akhanda: అఖండ అప్డేట్.. ట్రైలర్, సినిమా రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్…!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ముచ్చటగా అఖండ అనే చిత్రం వీరి కాంబినేషన్లో రూపొందుతుంది. శ్రీకాంత్, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన రెండు వీడియోలు, టైటిల్ సాంగ్ టీజర్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
కరోనా వలన చిత్రం పలుమార్లు వాయిదా పడింది. సినిమా రిలీజ్ ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అభిమానులలో పలు అనుమానాలు నెలకొని ఉండగా, వీటిపై రేపు అఫీషియల్ ప్రకటన చేస్తారని సమాచారం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను బట్టి చూస్తే నవంబర్ 15న చిత్రాన్ని రిలీజ్ చేస్తారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అలానే చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రచారం నడుస్తుంది.
రీసెంట్గా చిత్రం నుండి ‘భం…అఖండ’ అనే లిరిక్స్‌తో సాగిపోయే పాట విడుదల చేయగా, ఇది అభిమానులకు మంచి మాస్ కిక్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా పాటలో బాలయ్య వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ అద్భుతంగా ఆలపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

