Akhanda 2 | ‘అఖండ 2 తాండవం’పై మాస్ హంగామా ..విడుదలకు ముందే రికార్డు స్థాయి హైప్
Akhanda 2 | నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌పై మాస్ ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉంటాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత ఈ జంట నుంచి వస్తున్న సీక్వెల్ ‘అఖండ 2 – తాండవం’ పై ఆడియెన్స్‌లో భారీ ఉత్కంఠ నెలకొంది.
Akhanda 2 | నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌పై మాస్ ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉంటాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత ఈ జంట నుంచి వస్తున్న సీక్వెల్ ‘అఖండ 2 – తాండవం’ పై ఆడియెన్స్‌లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. చిత్రాన్ని పెద్ద స్కేల్లో చూపించబోతున్నారని అర్ధమవుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ హై–ఒక్టేన్ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలయ్య మరోసారి అఖండ రూపంలో శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు.
బోయపాటి శ్రీను ప్రత్యేకమైన మాస్ ట్రీట్మెంట్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారీ యాక్షన్ సెటప్స్ అన్ని కలిసి ఈ ప్రాజెక్టును ఈ ఏడాది టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రంగా నిలబెట్టాయి. ‘అఖండ’ విజయానికి కొనసాగింపుగా ‘అఖండ 2’ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. బాలయ్య కెరీర్లోనే ఇది అత్యధిక రేట్లకు డిజిటల్, సాటిలైట్, థియేట్రికల్ రైట్స్ అమ్ముడవుతున్న చిత్రం కావడం పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోల కోసం మేకర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేశారు. సమాచారం ప్రకారం డిసెంబర్ 4న రాత్రి 9 గంటలకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ప్రీమియర్ టికెట్ ధరను ₹600గా నిర్ణయించే ప్రతిపాదన జరుగుతుంది.
పెద్ద సినిమాల మాదిరిగా 1000–2000 రూపాయల భారీ రేట్లు వసూలు చేయకుండా, ప్రేక్షకులకు అందుబాటులో ఉండే రేంజ్‌లోనే ధరలు నిర్ణయించాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే, సినిమా మొదటి 10 రోజుల్లో సింగిల్ స్క్రీన్స్‌లో ₹75, మల్టిప్లెక్సుల్లో ₹100 అదనంగా వసూలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తులు పంపినట్లు సమాచారం. ప్రీమియర్ షోల డిమాండ్, బుకింగ్స్ వేగం పరిశీలిస్తే, ‘అఖండ 2’ ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ అవుతుందనే అంచనాలు ట్రేడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఈ ఏడాది “డాకు మహారాజ్”తో మంచి హిట్ అందుకున్న బాలయ్య, ‘అఖండ 2 – తాండవం’తో తన కెరీర్లోనే భారీ బ్లాక్‌బస్టర్ సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

