బాలకృష్ణ షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల వేడి తగ్గాక కె.ఎస్.రవీంద్ర(బాబీ) సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఇదిలావుంటే.. బాలయ్య నెక్ట్స్ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి దర్శకత్వంలోనే బాలయ్య ఓ పొలిటికల్ సినిమా చేయనున్నట్టు కూడా ఓ వార్త ప్రస్తుతం మీడియా సర్కిల్లో వినిపిస్తున్నది. అయితే.. ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ దర్శకుడు బోయపాటి.. క్లియర్ అప్డేట్ ఇచ్చేశారు.
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికలు అయిపోయిన తర్వాత ‘అఖండ-2’పై అధికారిక ప్రకటన ఉంటుంది. దైవభక్తి మన జీవితంలో భాగం. దాన్ని తెరపై జనానికి నచ్చేలా చూపిస్తే తప్పక ఆదరణ లభిస్తుంది అనడానికి ‘అఖండ’ ఓ నిదర్శనం. పసిబిడ్డ.. పకృతి.. పరమాత్మ నేపథ్యంలో ‘అఖండ’ తీశాం. సీక్వెల్లో వీటితోపాటు సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం కూడా ఉంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైంది’ అని తెలిపారు. అంటే.. మరోసారి ‘అఖండ’గా బాలయ్య విశ్వరూపం చూడబోతున్నామన్నమాట.