గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘ఆకాశ వీధుల్లో’. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ నాయికగా నటించింది. జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై మనోజ్ డీకే, డాక్టర్ మణికంఠ నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఆదివారం హైదరాబాద్లో చిత్ర సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ..‘మా చిత్రానికి స్పందన బాగుంది. లవ్, ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమాను తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక పూజిత పొన్నాడ పాల్గొన్నారు.