ఆకాంక్ష రంజన్ కపూర్.. పరిచయం అవసరం లేని బాలీవుడ్ సౌందర్యం. తనిప్పుడు, తెలుగులోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాయావన్’లో నటిస్తున్నది. ‘ఇప్పటికే తెలుగు ట్యూటర్ను నియమించుకున్నా.
ప్రాక్టీస్ మొదలైంది. త్వరలోనే డబ్బింగ్ కూడా చెప్పేస్తానేమో’ అంటున్నది ఆకాంక్ష. తెలుగు పరిశ్రమ కొత్తే కావచ్చు.. కానీ యూనిట్ సభ్యులు మాత్రం పాత పరిచయస్థుల్లానే అనిపిస్తున్నారట తనకు.