తమిళ నటుడు అజిత్ కుమార్ బైక్ రైడింగ్‌లో భాగంగా ఇటీవల దేశమంతటా పర్యటించారు. భారత్‌తో పాటు నేపాల్, భూటాన్, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను చుట్టి వచ్చాడు. నవంబరులో బైక్‌పై తదుపరి యాత్రకు ఆయన సిద్ధమవుతున్నాడు.
అయితే అజిత్ తన తోటి బైక్ యాత్రికుడు సుగత్ సత్పతికి పన్నెండున్నర లక్షల విలువైన సూపర్‌బైక్‌ను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. అజిత్ ఇటీవలే నేపాల్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేయడంలో సుగత్ సహాయం చేశాడు. ఇందుకు గుర్తుగా అజిత్ అతనికి సూపర్ బైక్‌ను బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.