Ajith Kumar | అమ్మ మరణం.. బరువెక్కిన గుండెతో మళ్లీ రేసింగ్ సూట్ వేసిన అజిత్ కుమార్
AjithKumarRacing | తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తల్లి మోహిని మణి మరణించిన కొన్ని రోజులకే మళ్లీ రేసింగ్ ట్రాక్‌పైకి వచ్చారు. మే 30వ తేదీ ఉదయం చెన్నైలో అజిత్ తల్లి మోహిని మణి (89) వృద్ధాప్య సమస్యలతో ప్రశాంతంగా కన్నుమూసిన విషయం తెలిసిందే.
Ajith Kumar Racing | తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని మణి (Mohini Mani) మరణించిన కొన్ని రోజులకే మళ్లీ రేసింగ్ ట్రాక్‌పైకి వచ్చారు. మే 30వ తేదీ ఉదయం చెన్నైలో మోహిని మణి (89) వృద్ధాప్య సమస్యలతో ప్రశాంతంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. అజిత్ ఈ తీవ్ర విషాదం నుంచి కోలుకోకముందే, జూన్ 5న ఆయన రేసింగ్ ప్రాక్టీస్ కోసం ట్రాక్‌పై అడుగుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను అజిత్ కుమార్ రేసింగ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ‘బరువెక్కిన గుండెతో మళ్లీ పనిలోకి దిగాను, కానీ జీవితం సాగిపోవాలి’ అంటూ ఈ ఫోటోలకు ఒక ఎమోషనల్ క్యాప్షన్‌ను జత చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహిని మణి, నిద్రలోనే కన్నుమూశారని అజిత్ కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమెను ఎంతో శ్రద్ధగా చూసుకున్న వైద్యులకు, తమకు అండగా నిలిచిన వారికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మోహిని మణి మరణవార్త తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అజిత్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ముఖ్యమంత్రి విజయ్ భారీ భద్రత మధ్య అజిత్ ఇంటికి వచ్చి, ఆయనను కౌగిలించుకుని ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

