సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా ఎంచుకొని సినిమాలు తీస్తూ విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వెట్రిమారన్. ఈ ఏడాది ‘విడుతలై-1’తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం అజిత్ 64వ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో ఓ సోషల్ ఇష్యూని చర్చించబోతున్నారని, కథ నచ్చడంతో అజిత్ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం అజిత్ ‘విడాముయార్చి’ చిత్రంలో నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కథానాయిక. ఇటీవలే దుబాయ్‌లో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.