డిజిటల్ వరల్డ్‌లోకి స్టార్ హీరో..!

రానున్న రోజులలో డిజిటల్ మీడియాదే హవా ఎక్కువగా ఉంటుందని పరిస్థితులు చూస్తుంటే అర్ధమవుతుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సమంత .. ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ చేయగా, కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్‌లో నటించింది. రీసెంట్గా తమన్నా 11 అవర్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ .. ”రుద్ర” అనే సిరీస్ తో డిజిటల్ డెబ్యూ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ అనేది దీనికి ఉపశీర్షిక. BBC స్టూడియోస్ ఇండియా సహకారంతో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు.
‘రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ క్రైమ్ డ్రామా సిరీస్ 2021లోనే డిస్నీ+హాట్ స్టార్ విఐపిలో విడుదల చేయబోతున్నారు. ఇందులో ఐకానిక్ కాప్‌గా కనిపించి అలరించనున్నారు. ‘లూథర్’ అనే బ్రిటీష్ డ్రామా సిరీస్ ఆధారంగా రూపొందుతోంది. ముంబైలోని ఐకానిక్ ప్రదేశాలలో ఈ వెబ్ సిరీస్‌ను చిత్రీకరించారు. రుద్ర సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని అజయ్ దేవగణ్ అన్నారు. కాగా, అజయ్ దేవగన్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ajay devgn
- digital world
- rudra
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

