అల్లరి నరేష్ కథానాయకుడిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. అండర్‌ట్రయల్ ఖైదీలు ఎదుర్కొనే సమస్యలకు కుటుంబ బంధాల్ని జోడిస్తూ దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ చిత్రం హిందీలో రీమేక్ కాబోతున్నది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో కలిసి బాలీవుడ్ అగ్రనటుడు అజయ్‌దేవ్‌గణ్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ‘ముఖ్యమైన కథను గురించి మీ అందరితో చెప్పాల్సిన సమయమిది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌తో కలిసి తెలుగులో విజయవంతమైన ‘నాంది’ సినిమాను హిందీలో పునర్నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అజయ్‌దేవ్‌గణ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తారా? మరో కథానాయకుడిని తీసుకుంటారా అన్నది త్వరలో వెల్లడికానున్నది.