బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని నటుడిగాను, నిర్మాతగాను సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నాడు అజయ్ దేవగణ్. నవంబర్ 22న అజయ్ దేవగన్ తన 30 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ప్రయాణంలో ‘జఖ్మ్, ఇష్క్, దిల్జాలే, హమ్ దిల్ దే చుకే సనమ్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, యువ, ఓంకార, సింగం, బోల్ బచ్చన్’ వంటి చిత్రాల్లో అత్యత్తమైన నటనకౌశాలన్ని ప్రదర్శించారు.
30 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో అజయ్ దేవగణ్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అజయ్ మృదుస్వభావి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరు. ఇంకా సినిమా పట్ల మంచి అభిరుచి కలిగి ఉన్నారు. నా అభినందనలు అజయ్. మీరు మరో 70 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నా.’ అంటూ బిగ్ బీ అమితాబ్ రాసుకొచ్చారు. అక్షయ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు.
అజయ్ దేవగణ్.. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగులోకి కూడా అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గురువుగా అజయ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న విడుదల కానుండగా, ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు.