పాన్ ఇండియా చిత్రాలను నిర్మిస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా పేరుపొందిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న మరో భారీబడ్జెట్ చిత్రం ‘లాల్‌సలాం’. రజనీకాంత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. సుభాస్కరన్ నిర్మాత, ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
లైకా ప్రతినిధి మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ఉన్న పవర్ఫుల్ పాత్రకు గొప్ప నటుడు కావాలి. అందుకే ఆ పాత్రకు రజనీకాంత్‌ను రిక్వెస్ట్ చేసి ఒప్పించాం. వైవిధ్యమైన కథతో రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు.