నెగెటివ్ రోల్లో ఐశ్వర్య?
వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ దక్షిణాదిలో ప్రతిభావంతురాలైన కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది ఐశ్వర్యరాజేష్. అయితే ఈ భామకు తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగానే బ్రేక్ దొరికింది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో తెలుగులో ఆమె తొలి బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది.
వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ దక్షిణాదిలో ప్రతిభావంతురాలైన కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది ఐశ్వర్యరాజేష్. అయితే ఈ భామకు తెలుగులో మాత్రం కాస్త ఆలస్యంగానే బ్రేక్ దొరికింది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో తెలుగులో ఆమె తొలి బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాలో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ఓ బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ప్రకటన రోజు నుంచి వార్తల్లో నిలుస్తున్నది.
గాడ్ ఆఫ్ మాసెస్‌గా అభిమానులు పిలుచుకునే బాలకృష్ణ.. సామాజిక అంశాల మేళవింపుతో మాస్ కథాంశాల్ని తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు కొరటాల శివ కలయిక వెండితెరపై సంచలనాల్ని సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇందులో ఐశ్వర్యరాజేష్ ఓ కీలక పాత్రకు ఎంపికైందని తెలిసింది. నెగెటివ్ షేడ్స్‌తో ఆమె పాత్ర సాగుతుందని, కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

