వారికోసమైనా వెళ్లాలి..
కొన్నేళ్లుగా ప్రతి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఐశ్వర్యరాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూనే ఉన్నది. అసలు ఆ వేడుకకు కళే ఆమె అనేవాళ్లు కూడా లేకపోలేదు. ఈ ఏడాది కేన్స్ వేడుక రానే వచ్చింది.
కొన్నేళ్లుగా ప్రతి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఐశ్వర్యరాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూనే ఉన్నది. అసలు ఆ వేడుకకు కళే ఆమె అనేవాళ్లు కూడా లేకపోలేదు. ఈ ఏడాది కేన్స్ వేడుక రానే వచ్చింది. మరి ఐశ్వర్య ఈ దఫా ఏ లుక్‌లో కనిపిస్తారు? రెడ్ కార్పెట్‌పై ఎలా నడుస్తారు? అనే ఆరాటం లక్షలాది అభిమానుల్లో నెలకొని ఉండటం కామనే. ఆనవాయితీ ప్రకారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్య బయలుదేరింది.
ఈ సారి తనతోపాటు కుమార్తె ఆరాధ్య కూడా కేన్స్‌లో ప్రత్యేక ఆకర్షణ కానున్నది. వీరిద్దరూ ముంబయ్ ఎయిర్‌పోర్ట్‌లో కేన్స్‌కు వెళుతూ కెమెరాలకు చిక్కారు. అయితే.. ఐశ్వర్యరాయ్ కుడిచేతికి కట్టుతో కనిపించింది. ఊహించని ఈ పరిణామాన్ని చూసి ఆమె అభిమానులు షాక్ అయ్యారు. ఈ గాయంతో కేన్స్ రెడ్‌కార్పెట్‌పై ఐశ్వర్య ఎలా నడుస్తుంది అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అంతగాయంలో కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సిద్ధమైన ఆమె నిబద్ధతను కొందరు కొనియాడుతున్నారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ ‘నాకోసం ఎదురు చూసే లక్షలాది అభిమానులకోసమైనా వెళ్లాలి. అలాగే నేను కనిపించగానే కెమెరాలతో క్లిక్‌మనిపించడానికి వందలాది ఫొటోగ్రాఫర్లు నాకోసం అక్కడ ఎదురు చూస్తుంటారు. వారికోసమైనా వెళ్లాలి’ అంటూ అందంగా నవ్వేశారు ఐష్. ఈ నెల 25వరకూ కొనసాగే ఈ వేడుకల్లో ఐశ్వర్యరాయ్‌తోపాటు ఊర్వశీ రౌతేలా, అదితిరావు హైదరీ, శోభితా ధూళిపాళ, కియరా అద్వానీ కూడా పాల్గొనబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

