న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్ ప్రపంచంలో ఎన్నో సరికొత్త మార్పులకు నాంది పలుకుతోంది. ఏఐ టూల్స్‌తో రచయితలు అలవోకగా బుక్స్ రాస్తుండగా ఆర్టిస్టులు సైతం ఏఐతో తమ నైపుణ్యాలకు అద్భుత క్రియేటివిటీ జోడిస్తున్నారు. మిడ్‌జర్నీ వంటి యాప్‌లను ఉపయోగిస్తూ ఇప్పటివరకూ మన ఊహకు సైతం అందని ఇమేజ్‌లను (AI Pics) జనరేట్ చేస్తున్నారు.
పలు ఏఐ ఆధారిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తాజాగా బాలీవుడ్ హీరోలను మహిళల్లా ఆవిష్కరించే ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. సాహిద్ అనే ఆర్టిస్ట్ ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. అమితాబ్ బచన్ నుంచి షారుక్ ఖాన్ వరకూ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు మహిళలతే ఎలా ఉంటారో ఊహిస్తున్న ఇమేజ్‌లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇక సల్మాన్ ఖాన్ మహిళ రూపంలో చిత్రాంగద సింగ్‌ను పోలిఉన్నారని కొందరు కామెంట్ చేయగా వరుణ్ ధావన్ సోనం బాజ్వాలా ఉన్నాడని మరికొందరు రాసుకొచ్చారు. ఇక అద్భుతమైన వర్క్ అని ఈ పోస్ట్‌పై ఓ యూజర్ ప్రశంసలు కురిపించగా, లవ్ ఇట్ అని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More
Sudhakar | ఆ వార్తలన్నీ అవాస్తవం.. నేను బాగానే ఉన్నా : కమెడియన్ సుధాకర్