Ahimsa Movie | హీరో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గతంలోనే షూటింగ్ ప్రారంభమించింది. కానీ కరోనా కారణంగా లేటవుతూ వచ్చింది. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్డేట్తో ప్రేక్షకులను ముందుకు వచ్చారు.
ఈ చిత్రంలోని ‘అమ్మేశానే’ అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఐటెం పాటగా తెరకెక్కిన ఈ సాంగ్ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆర్.పీ పట్నాయక్ స్వర పరిచిన ఈ పాటను మంగ్లీ ఆలపించింది. ఇప్పటికే విడుదలైన నీతోనే, కమ్మగుంటాదే పాటలకు విపరరీతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారి హీరోయిన్గా నటిస్తుంది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.