మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ నిర్మించారు. ఈ సినిమాలోని ‘తెలుసా తెలుసా’ అనే పాటను ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ సమంత సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు.
మలయాళ నటుడు సిద్ధిక్, హీరో విశ్వంత్, చైత్ర శుక్ల ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి.