Agent Movie Business | మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఏజెంట్ సినిమాపై అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న అఖిల్ తొలిసారి యాక్షన్ సినిమా చేయడం.. అందులోనూ సిక్స్ ప్యాక్ బాడీతో కనబడనుండటంతో ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. పైగా సురేందర్ రెడ్డి వంటి స్టైలిష్ డైరెక్టర్ ఈ సినిమాకు తెరకెక్కించడంతో సినీ ప్రేమికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దానికి తోడు ఇప్పటివరకు రిలీజైన టీజర్, ట్రైలర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా శుక్రవారం తెలుగుతో పాటు మలయాళంలోనూ ఏకకాలంలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్‌లోనే జరిగింది. ఏజెంట్ సినిమాకు దాదాపు రూ.37 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అఖిల్ మొదటి సినిమా తర్వాత అత్యధిక బిజినెస్ జరిగింది ఈ సినిమాకే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.38 కోట్లు రాబట్టాల్సి ఉంది. నిజానికి ఇది అఖిల్‌కు పెద్ద టార్గెటే. సూపర్ హిట్ టాక్ సైతం తెచ్చుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ కేవలం రూ.25 కోట్ల షేర్‌ను మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ లెక్కన అఖిల్‌కు ఇది పెద్ద టార్గెటే. అయితే సినిమాకు ఇప్పుడున్న బజ్కు కాస్త పాజిటీవ్ టాక్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షం కురవడం సాధ్యమే.
స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. సాక్షీ వైద్య హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకు హిప్ హాస్ తమిళ స్వరాలు సమకూర్చాడు. అయితే ఏ ఒక్క పాట కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఏకే ఎంటర్టైనమెంట్స్తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించాడు.