Agent Movie | ఏజెంట్ సినిమా నుంచి రామకృష్ణ వీడియో సాంగ్ రిలీజ్
Agent Movie Songs | ఏజెంట్ ఫలితాన్ని అక్కినేని అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. గంపెడంతో ఆశతో థియేటర్లోకి వెళ్లిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో బయటకు వచ్చారు. దాదాపు రెండేళ్లు ఒళ్లు హూనం చేసుకున్న అఖిల్‌కు ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందనుకుంటే.. తన కెరీర్లో ఒక మచ్చలా మిగిలిపోయింది.
Agent Movie Songs | ఏజెంట్ ఫలితాన్ని అక్కినేని అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. గంపెడంతో ఆశతో థియేటర్లోకి వెళ్లిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో బయటకు వచ్చారు. దాదాపు రెండేళ్లు ఒళ్లు హూనం చేసుకున్న అఖిల్‌కు ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందనుకుంటే.. తన కెరీర్లో ఒక మచ్చలా మిగిలిపోయింది. అసలు ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ‘ధృవ’ సినిమా తీసిన సురేందర్ ఏనా అనే డౌట్ కూడా ఎంతో మందికి వచ్చింది. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది ఈ సినిమా వైపు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడలేదంటే ఈ సినిమా ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిర్మాత అనీల్ సుంకర సైతం ఈ సినిమా ఫేయిల్యూర్‌ను ఎలాంటి భేషజాలకు పోకుండా ఒప్పేసుకున్నాడు.
ఇక మే 19న ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ తర్వాత పోస్ట్ పోన్ చేశారు. సినిమాను ఎడిటింగ్ చేసి కొత్త సీన్లు యాడ్ చేసి స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి రామకృష్ణ గోవిందా వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటలో డ్యాన్స్ కూడా కాస్త క్రింజీగా ఉంటుంది. హిప్ హాప్ తమిళ స్వర పరిచిన ఈ పాటను రామ్ మిర్యాల ఆలపించాడు. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ పాటకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. సాక్షీ వైద్య హీరోయిన్ గా నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

