Agent Movie | అక్కినేని అఖిల్ ఎన్నో ఎళ్ళుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో హిట్టు సాధించినా.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఏజెంట్’ సినిమాపైనే ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఓ మ్యూజిక్ బిట్ ఉండనుందట. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఇప్పటికే మల్లి మల్లి అనే పాట రిలీజైంది. ఆడియోన్స్ నుంచి ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య నటిస్తుంది. ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.