పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ రీసెంట్గా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఈ చిత్రం హిందీలో రూపొందిన పింక్‌కు రీమేక్‌గా రూపొందింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. అనన్య, అంజలి, నివేదా థామస్ తమ పాత్రలలో ఒదిగిపోయి అలరించారు.
వకీల్ సాబ్ టీమ్ చేసిన కృషి వారికి సత్ఫలితాన్ని ఇచ్చింది. విమర్శకుల నుండి సైతం ఈ మూవీకి ప్రశంసలు అభించాయి. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రం హిందీ మరియు తమిళ్ వెర్షన్స్ కన్నా బెటర్ అని ప్రూవ్ అయింది. ఐఎండిబి లో ఈ మూడు వర్షెన్స్లో కెల్లా వకీల్ సాబ్ నే బాగుందని సినీ ప్రేమికులు తమ ఫీడ్ బ్యాక్ ఇవ్వగా ఈ చిత్రం హైయెస్ట్ రేటెడ్ చిత్రంగా నిలిచింది. దీంతో వకీల్ సాబ్ ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. కాగా, పింక్ చిత్రం అజిత్ హీరోగా “నెర్కొండ పారవై” గా తమిళంలోను రీమేక్ అయిన విషయం తెలిసిందే.