ముంబై : బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌ను ఇతర సెలబ్రిటీలు అనుకరిస్తున్నారు. రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ కాక రేపగా తాజాగా బిగ్‌బాస్ ఫేం నటుడు ఆసిం రియాజ్ సోషల్ మీడియాలో నగ్న ఫోటోలతో దుమారం రేపాడు. ఫిట్నెస్ ఐకాన్‌గా పేరొందిన ఆసిం రియాజ్ తన నగ్న ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశాడు.
రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ కంటే ముందుగా 2017లోనే ఆసి ఫోటోషూట్ పూర్తి చేయగా రణ్వీర్ స్ఫూర్తితో వాటిని ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోల్లో ఆసిం రియాజ్ షర్ట్‌లెస్‌గా డెనిమ్స్కు జిప్ లేకుండా కనిపించాడు. ఆసిం తన పోస్ట్‌కు ఇన్స్పైర్డ్ బై రణ్వీర్ అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఆసిం ఫోటోలను ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. ఇక రణ్‌వీర్‌సింగ్ పేపర్ మేగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేశాడు. రణ్వీర్ న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. తన న్యూడ్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన తర్వాత మహిళల మనోభావాలను దెబ్బతీశాడనే ఆరోపణలతో రణ్వీర్ సింగ్‌పై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.